RCB Unbox Event: కొత్త కెప్టెన్.. కొత్త జెర్సీ.. కొత్త ఆరంభం! 1 y ago

featured-image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అన్‌బాక్స్ ఈవెంట్ మార్చి 17, 2025న అంగరంగ వైభవంగా జరిగింది. IPL 2025 సీజన్‌కు ముందు జరిగిన ఈ వేడుకలో అభిమానుల సందడితో స్టేడియం నిండిపోయింది. ఈ కార్యక్రమంలో RCB 2025 IPL కొత్త జెర్సీని ఆవిష్కరించారు. విరాట్ కోహ్లీ స్టేడియంలోకి రాగానే అభిమానుల కేరింతలతో స్టేడియం మారుమోగిపోయింది. ఫాఫ్ డు ప్లెసిస్ స్థానంలో రజత్ పాటిదార్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, విరాట్ కోహ్లీ కొత్త కెప్టెన్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు.


ఈ వేడుకలో కోహ్లీ మాట్లాడుతూ.. రజత్ పాటిదార్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించారని, అతను సుదీర్ఘ కాలం సారథిగా కొనసాగుతాడని.. జట్టును నడిపించేందుకు అతనికి తగిన అన్ని అర్హతలు ఉన్నాయని విరాట్ కోహ్లీ తెలిపారు. అంతేకాకుండా పాటిదార్‌ అన్ని విధాలా అర్హుడని, అభిమానులు పాటిదార్‌కు తమ ప్రేమను అందించాలని.. కోహ్లీ కోరారు. పాటిదార్‌కు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని.. భయపడాల్సిన అవసరం లేదని కోహ్లీ తెలిపారు. కోహ్లీ మాటలు పాటిదార్‌కు ఎంతో ధైర్యాన్నిచ్చాయి.


RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌ మాట్లాడుతూ.. కోహ్లీ, AB డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి లెజెండ్స్ ఆడిన జట్టుకు నాయకత్వం వహించడం తనకు గౌరవంగా ఉందని తెలిపాడు. "విరాట్ భాయ్, AB డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి లెజెండ్స్ RCB కోసం ఆడారు. నేను వారిని చూస్తూ పెరిగాను. మొదటి నుండి.. నేను ఈ ఫ్రాంచైజీని చాలా ఇష్టపడ్డాను. IPL క్రికెట్‌లో అతిపెద్ద జట్లలో ఒకదానికి నాయకత్వం వహించడానికి నాకు ఒక కొత్త పాత్ర లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా" అని పాటిదార్ పేర్కొన్నారు. 


ఈ వేడుకలో DJ టిమ్మీ ట్రంపెట్ మరియు ఇతర స్థానిక కళాకారులు తమ సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పునీత్ రాజ్ కుమార్ కు ఘనంగా నివాళులర్పించారు. రోమారియో షెఫర్డ్ సిక్స్ హిట్టింగ్ పోటీలో విజేతగా నిలిచాడు. ఇక ఈ లీగ్ ఆరంభం (2008) నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి.. తనని RCB ప్రేమాభిమానులు బాగా అభిమానించారని.. తాను సాధించిందంతా RCB అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని కోహ్లీ తెలిపారు. 18 సంవత్సరాలుగా RCB ఆడుతున్నాన‌ని... ఇదో అద్భుతమైన ప్రయాణం అని జట్టులో నైపుణ్యానికి కొదవలేదని, ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని విరాట్ పేర్కొన్నారు. కోహ్లీ ని మళ్లీ T20 ఫార్మాట్‌లో చూసేందుకు అభిమానులు బాగా ఆతృతతో ఉన్నారు. ఈ సారైనా RCB కప్ కల‌ను నెరవేర్చుకుంటారా? వేచి చూడాల్సిందే.!


ఇది చదవండి: WPLలో ముంబై హవా! ఛాంపియన్స్ కిరీటం మళ్ళీ వారిదే!

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD